సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి!
- కార్పొరేట్ పని సంస్కృతిపై అసంతృప్తితో ముంబై యువతి వీడియో
- సీనియర్లను పేరుతో పిలవడం తనను ఇబ్బంది పెడుతోందని ఆవేదన
- భారతీయ సంస్కారాలకు ఇది విరుద్ధమని పోస్ట్‌లో వెల్లడి
- యువతి వాదనకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన యువతి పోస్ట్
కార్పొరేట్ కార్యాలయాల్లోని పని సంస్కృతిపై ముంబైకి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసులో, పదవిలో పెద్దవారైన సీనియర్లను పేరు పెట్టి పిలవాలనే నిబంధన తనను ఎంతగా ఇబ్బంది పెడుతోందో ఆమె వివరించారు.
వివరాల్లోకి వెళ్తే, సమృద్ధి శర్మ అనే యువతి ఇటీవల ఒక ప్రాజెక్ట్ మీటింగ్ తర్వాత ఈ వీడియోను షేర్ చేసింది. తన మేనేజర్ గరిమ వయసులో చాలా పెద్దవారని, ఆమెకు మనవళ్లు కూడా ఉన్నారని, అయినప్పటికీ కార్పొరేట్ నిబంధనల ప్రకారం ఆమెను 'గరిమ' అని పిలవాల్సి రావడం తనను బాధిస్తోందని చెప్పింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో అందరినీ 'సార్, మేడమ్' అని పిలిస్తే, తన మేనేజర్ వారించి పేరుతోనే పిలవమని చెప్పారని గుర్తుచేసుకుంది. నాలుగు నెలలు గడిచినా ఆ పద్ధతికి అలవాటు పడలేక, ఆమెను 'గరిమ జీ' అని పిలుస్తున్నట్లు తెలిపింది.
"చిన్నప్పటి నుంచి పెద్దలను గౌరవించాలని, మర్యాదగా పిలవాలని మనకు నేర్పించారు. 22 ఏళ్లుగా నేర్చుకున్న ఈ విలువలను కొన్ని నెలల ఉద్యోగం కోసం వదిలేయాలా?" అని ఆమె తన వీడియోలో ప్రశ్నించింది. "ఈ విషయంలో నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడుతున్నానా?" అనే క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది.
సమృద్ధి పోస్ట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. చాలామంది ఆమె వాదనతో ఏకీభవించారు. "సీనియర్ల పేరు చివర 'జీ' చేర్చడం సరైన మధ్యేమార్గం" అని ఒకరు, "కార్పొరేట్ కల్చర్, భారతీయ సంస్కారాల మధ్య మా మెదడులో నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది" అని మరొకరు కామెంట్ చేశారు. ఈ సంఘటన, పాశ్చాత్య కార్పొరేట్ సంస్కృతికి, భారతీయ సాంప్రదాయ విలువలకు మధ్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సాంస్కృతిక సంఘర్షణను మరోసారి వెలుగులోకి తెచ్చింది.